నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన అఖండ (Akhanda)సినిమా భాక్సాపీస్ దద్దరిల్లేలా చేసింది.అలాగే ఓటిటిలో వచ్చిన అన్ స్థాపబుల్(Unstoppable ) షో కూడా సూపర్ హిట్ గా నిలిచిది. ఫుల్ ఫామ్ లో ఉన్న భాలయ్య(Balakrishna), గోపిచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్యంలో ఒక మూవీ చేస్తున్నారు. శృతిహాసన్ (Shruthi hassan )ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.నటినటులని కూడా ఖరారు చేసారు .ఈ సినిమా తరువాత బాలయ్య మరో సినిమాకి కూడా రెడీ అయ్యాడు. అనీల్ రావిపూడితో(Anil ravipudi) సినిమా మొదలు పెట్టబోతునన్నాడు. ఇప్పుడు F3 సినిమాతో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి.
వీలైనంత త్వరలో బాలకృష్ణతో సినిమాకు ముహుర్తం చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య(NBK) పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తారని సమాచారం.మంచి ఫామ్ లో ఉన్న బాలకృష్ట తన రెట్టించిన వేగంతో మూవీస్ చేస్తున్నాడు.