బాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి(Bappi Lahari ) కన్ను మూశారు. గత కొన్ని రోజుల నుండి హెల్త్ సమస్యలతో బాధ పడుతున్న బప్పీలహరి మృతి చెందడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది.అనారోగ్యంతో ముంబయి హాస్పిటల్ లో చేరిన ఈ లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందడం బాధాకరం.బాలీవుడ్ లో 50 సినిమాలకు పైగా ఆయన సంగీతాన్ని అందించాడు. ఆయన క్రియేట్ చేసిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ ఆయన సంగీతం అందించారు.సింహాసనం,స్టేట్ రౌడీ,గ్యాంగ్ లీడర్,రౌడీ గారి పెళ్ళాం,బ్రహ్మ,నిప్పు రవ్వ, బిగ్ బాస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.బప్పీలహరికి 69 సంవత్సరాలు.హిందీలో ఆయన పాడిన డిస్కో డాన్సర్, చలై చలై ,శారబి పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.