కింగ్ నాగార్జున(Nagarjuna ), యువసామ్రాట్ నాగచైతన్య(Naga chaitanya) నటించిన తాజా చిత్రం బంగార్రాజు(Bangarraju). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది .దాదాపు 60 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ వసూలు చేసి 2022 లో క్లీన్ హిట్ గా నిలిచింది .ఇప్పటివరకు థియేటర్స్ లో సందడి చేసిన బంగార్రాజు (Bangarraju OTT )ఈరోజు నుండి ఓటిటిలో కూడా బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. జీ5 ఓటిటిలో ఈరోజు నుండి బంగార్రాజు మూవీ స్ట్రీమింగ్ కానుంది .ఈ మూవీలో నాగార్జునకి జోడీగా రమ్యకృష్ణ (Ramya krishna)అలాగే నాగచైతన్య కు జోడిగాకృతి shetty (Krithi shetty) నటించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు దాని మీద పెట్టుకున్న నమ్మకం నిజంచేసింది. చాలా రోజుల తర్వాత నాగార్జునకు ఒక మంచి హిట్ ను అందించింది.మరి థియేటర్ సూపర్ హిట్ అయిన బంగారాజు ( Bangarraju ) ఓటిటిలో కూడా తనదైన స్టైల్లో ఎక్కువ వ్యూస్ దక్కించుకొని సూపర్ హిట్ కొడతాడో చూడాలి.