శ్రీకాంత్ తనయుడు రోషన్ రో పెళ్లి సందడి మూవీ లో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల టాలీవుడ్ లో వరస ఆఫర్స్ కొట్టేస్తోంది. పెళ్లి సందడిలో శ్రీలీలకు క్రేజ్ పెరిగింది .దాంతో రవితేజ సరసన ధమాకా మూవీలో ఆఫర్ కొట్టేసిన ఈ భామ ఇప్పుడు ప్రభాస్ తో నటించబోతోంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా డీలక్స్ మూవీలో శ్రీలీలకి ఛాన్స్ వచ్చింది .వరుసగా ఫ్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రభాస్ బడ్జెట్ పరంగా షూటింగ్ పరంగా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అందుకే తక్కువ బడ్జెట్ తో తక్కువ సమయంలో మూవీస్ కంప్లీట్ అయ్యేలా కూడా ప్రభాస్ ప్లాన్ చేశాడు. ఇదే క్రమంలో దర్శకుడు మారుతితో రాజా డీలక్స్ అనే సినిమాకి రెడీ అయ్యాడు. ఈ మూవిని మార్చి 18 నుండి ప్రారంభించబోతున్నారు. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందట వారిలో ఒకరు మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ కాగా మరొకరు బాలీవుడ్ బ్యూటీ అని తెలుస్తోంది. ఇక మూడో భామగా శ్రీలీలను ఎంపిక చేశారట .టాలీవుడ్ లోకి ఎంటరైన అతికొద్ది సమయంలోనే ప్రభాస్ లాంటి ఫ్యాన్ ఇండియా స్టార్ తో ఫ్యాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల అంటూ టాలీవుడ్ లో వినిపిస్తోంది.