టాలీవుడ్ అందాల భామ సమంత (samantha)ఏది చేసినా ఇప్పుడు ఒక సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండే సమంత తన ఫొటోస్, వీడియోస్ అభిమానులతో పంచుకుంటూ తన పాలోయింగ్ మరింత పెంచుతోంది. ఇదే క్రమంలో మరోసారి సమంత (Samantha)చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్(Vijay), పూజా హెగ్డే (Pooja Hegde )జంటగా నటించిన బీస్ట్ (Beast ) సినిమా నుండి అరబిక్ కుతూ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే .ఈ పాట సూపర్ హిట్ అయింది .ఈ పాటలోని స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇక ఇటీవల మాల్దీవులలో ఈ పాటకు స్టెప్పులేస్తూ పూజా హెగ్డే2 (Pooja hegde ) ఒక వీడియోని పోస్ట్ చేసింది. అంతేకాకుండా తనలా స్టెప్పులు వేయాలంటూ ఒక చాలెంజ్ నెటీజన్స్ కూడా ఛాలెంజ్ ఇచ్చింది.ఇప్పుడు ఈ చాలెంజ్ సమంత రిప్లై ఇచ్చింది. ఒక ఎయిర్ పోర్ట్ లో అరబిక్ కుతు కు పాటకు డాన్స్ వేస్తూ వీడియో తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సమంత .విమానం లేట్ అయింది… ఈ రాత్రికి రిథం అరబిక్ కుతూ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఏది ఏమైనా పూజ హెగ్డే ఛాలెంజ్ కి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది సమంత.
Recent Comment