కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar ) ఇంట మరో విషాదం. కన్నడ (Kannada )ఇండస్ట్రీలో కోట్ల మంది అభిమానులు ఉన్న పునీత్ ఇటీవల గుండె పోటుతో మరణించడం అందరిని షాక్ కి గురిచేసింది. ఫ్యామిలీ తో పాటు అభిమానులు కూడా పునీత్ లేడు అనేది ఇప్పటికి నమ్మలేక పోతున్నారు.ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మామగారు కూడా మరణించారు.

పునీత్ రాజ్ కుమార్(Punitha Raj Kumar ) ,భార్య అశ్వని (Ashwini Raj Kumar )నాన్నగారు చనిపోయారు. అశ్వినీ నాన్నగారు రెవనాథ్ కి 78 సంవత్సరాలు.పునీత్ చనిపోయాక అశ్వినీ నాన్నగారు ఎక్కువ ఒత్తడికి గురి కావడంతో ఆయనకు కూడా పోటు వచ్చింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతోనే చనిపోవడంతో కొద్దీ సమయంలోనే తండ్రి ,భర్తని కోల్పోయిన అశ్వినీ గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.