హీరో శర్వానంద్(Sharwanand ) నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavaallu meeku joharlu ) .మార్చి 4న గ్రాండ్ గా రీలిజ్ చేయనున్నారు.ఈ నేపథ్యంలో మరొక సాంగ్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోవటం..ఆసమ్ (Awesome Song )అంటు సాగే పాటను విడుదల చేసారు. శ్రీమణి రాసిన ఈ పాటను దేవి(DSP ) సోదరుడు సాగర్ మంచి మెలోడిగా ఆలపించారు.ఈ పాట ఇపుడు యుట్యూబ్ లో అదరగొడుతోంది.మిలియన్ వ్యూస్ సాధిస్తూ సూపర్ హిట్ అయింది .
ఇక ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika )కథానాయికగా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెకటేశ్వర సినిమాస్ బేనర్ పై సుదాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ కూడా వచ్చేసింది.దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలేట్ అని చెప్పాలి. రాదిక శరత్ కుమార్ ,ఖుష్బూ,ఊర్వశి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాని దర్శకుడు కిషోర్ తిరుమల తీసాడు.ఫిబ్రవరి25 న విడుదల కావాల్సిన ఈ మూవీ భీంలా నాయక్ వల్ల మార్చ్ 4కి వాయిదా పడింది. ప్లాప్ లో శర్వానంద్(Sharwanand ) కి ఈ మూవీ హిట్ ఇస్తుందేమో చూడాలి
Recent Comment