టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టి 20 మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు.వెస్టిండీస్ ఇచ్చిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కి రోహిత్ శుభారంభం ఇచ్చాడు. కరేబియన్ బౌలర్ల మీద విరుచుకు పడి పరుగుల వరద పరించాడు. కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేసాడు.ఇందులో 4 పోర్లు,3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో రోహిత్ స్ట్రైక్ రేట్ 210 గా ఉంది. అర్థ చెంచురికి దగ్గరలో ఉన్న రోహిత్ ని రోష్టాన్ చేజ్ ఔట్ చేసాడు.40 పరుగులు చేసాక రోస్టన్ చేజ్ బౌలింగ్ లో ఓడీన్ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు రోహిత్.ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ రాణించడంతో 157 పరుగులు చేసింది. మొత్తానికి మొదటి టి 20 రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడు.
Recent Comment