పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan ) అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. Ap లో ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో వీలైనంత త్వరగా ఎక్కువ మూవీస్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ తో పవర్ స్టార్ ఉన్నారు.ఇప్పటికే భీంలా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల అవుతుండగా, హరీష్ శంకర్(Harish shankar) దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ( Bavadheeyudu Bagath singh ) అలాగే క్రిష్ ( Krish ) దర్శకత్వంలో హరిహర వీరమల్లు(Harihara veeramallu ) మూవీలో పవన్ నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సినిమాని పవన్ లైన్ లో పెట్టినట్టు సమాచారం. తమిళంలో స్టార్ హీరో అజిత్ వాలిమై( valimai) సినిమాను రూపొందించిన విహెచ్ వినోద్ తో పవన్ (Pawan kalyan ) సినిమా చేయబోతున్నట్లు సమాచారం .ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది .అంతే కాకుండా ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ భీమ్లా నాయక్ కి పోటీగా విడుదలవుతోంది .ఇక ఈ డైరెక్టర్ ఒక స్టోరీతో పవన్ ని కలిసినట్టు సమాచారం .ఈ కథ పై పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి pawan kalyan ఈ తమిళ దర్శకుడుకి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది .ఇక పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీంలా నాయక్ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ కొడతాడో చూడాలి.