టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ స్టయిల్ సెపరేట్ అని చెప్పాలి. భోళా శంకరుడుగా తన మనసులో ఉన్న మాటలను ఎలాంటి భయం లేకుండా చెప్పేస్తుంటారు బాలయ్య.టాలీవుడ్ ఇటీవల కాలంలో టికెట్ రేట్ల విషయంలో చర్చలు హాట్ టాపిక్ గా మారాయి .వీటిని ముగింపు పలికేందుకు చిరంజీవి తన టీంతో ఏపీ సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే .ఇక ఈ మీటింగ్ కి నందమూరి నటసింహం బాలయ్యను కూడా పిలిచారట .కానీ బాలయ్య నేను రాను అని చెప్పినట్టు తెలియజేశారు. బాలయ్య టిడిపి పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలో అతను తన అపోజిషన్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కి వెళ్తే విమర్శలు వస్తాయని నేపథ్యంలో బాలకృష్ణ చిరంజీవితో కలిసి మీటింగ్ కి వెళ్ళలేదు. ఇదే విషయాన్ని బాలకృష్ణ కూడా తెలియజేశారు .సినిమా బాగుంటే టికెట్ రేటుతో పనిలేదని బాలకృష్ణ తెలియజేశారు .కోవిడ్ ఉన్న సమయంలో టికెట్ రేట్స్ తక్కువగా ఉన్న సమయంలో కూడా అఖండ సినిమా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాలయ్య గుర్తుచేశారు .ఏది ఏమైనా టికెట్ రేట్ల విషయంలో అందరూ వెళ్లినప్పటికీ బాలకృష్ణ వెళ్ళలేదు అంటూ తనపై వస్తున్న ట్రోల్స్ పై తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చారు బాలయ్య.