ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌- క్రియేటివ్ డిరెక్టార్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సినిమా.  తాజాగా  2021 ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ అంటూ ఓ పోస్టర్ ని కూడా  రిలీజ్ చేసింది చిత్ర బృందం. మాసివ్ బ్లాక్ బస్టర్ గా పేర్కొంటూ ప్రేక్షకుల్లోకి పోస్టర్ ని విడుదల చేశారు. అయితే గ్రాస్ ఫిగర్ ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.

కాగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అక్టోబర్ లేదా నెక్ట్స్ ఇయర్ క్రిస్మస్ కు పుష్ప ది రూల్ రిలీజ్ అవుతుంది.కాగా, ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక నటించగా..  ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించాడు.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించగా..  దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చాడు.