వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా అదరగొట్టే నరైన్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు.బంగ్లా దేశ్ ప్రీమియర్ లీగ్ 2022 ( balngladesh premier league 2022) లో విధ్వసం సృష్టించాడు.కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ తరపున ఆడుతున్న సునీల్ 16 బంతుల్లోనే 57 పరుగులు చేసాడు. ఇక 13 బంతుల్లోనే అతను హాఫ్ సెంచురి చేయడం విశేషం.6 భారీ సిక్స్ లు బాదేసిన సునీల్, 4 పోర్లతో అర్థ శతకం అందుకున్నాడు.సునీల్ ఆడిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ సికర్స్ తో ఇన్నింగ్స్ ఖాతా తెరచిన నరైన్ BPL 2022లోనే వేగవంతమైన అర్థ శతకం నమోదు చేశాడు.టీ 20 ల్లో వేగవంతమైన అర్థ శతకం సాధించిన రికార్డ్ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది.2007 లో కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ హాఫ్ సెంచురి చేసాడు. ఆ రికార్డ్ బ్రేక్ చేయడంలో సునీల్ నరైన్ కొద్దిలో మిస్ అయ్యాడు.