ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వస్తున్న క్రేజీ సినిమా జయమ్మ పంచాయితీ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అలాగే మొదటి పాటకి మంచి స్పందన వచ్చింది. యాంకర్ గా ఉన్న సుమ మొదటిసారి ప్రధాన పాత్రల్లో సినిమా చేస్తుండడంతో jayamma panchayiti మూవిపై క్రేజ్ పెరిగింది. ఈ సినిమాను విజయ్ కుమార్ కలివారపు అనే కొత్త దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. పల్లెటూరులో జరిగే కథలో జయమ్మ క్యారెక్టర్ చేసే హడావిడి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు జయమ్మ పంచాయతీకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే జయమ్మ పాత్ర కోసం Anchor Suma చాలా కష్ట పడినట్లు తెలుస్తోంది. పల్లెటూరు మహిళగా ఆమె కట్టు బొట్టు ,అలాగే తెలంగాణ యాసలో ఆమె మాట్లాడే విధానం మేకింగ్ వీడియోలో హైలెట్ గా నిలిచాయి.ఇక ఈ మూవీ కి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ MM Keeravani సంగీతాన్ని అందిస్తున్నాడు .దాంతో suma నటించిన Jayamma Pamchayiti మూవీపై అంచనాలు పెరిగిపోయాయి .ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.rajamouli ,Nani లాంటి సెలబ్రిటీస్ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ,జయమ్మ పంచాయతీ పై క్రేజ్ పెరిగింది .ఇదే కక్రేజ్ తో జయమ్మ పంచాయతీ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.