చెన్నై సూపర్ కింగ్స్‌ కి (CSK) పెద్ద షాక్ తగిలింది. Csk టీమ్ తరపున ఆడిన దీపక్ చాహర్(Deepak Chahar ) అద్భుతమైన బౌలింగ్ తో రాణించాడు. ఆ తరువాత టీమిండియాలో కూడా రాణించాడు. దాంతో ఇటీవల జరిగిన మెగా వేలంలో csk దీపక్(Deepak ) ని 14 కోట్లకు కొనుగోలు చేశారు. ఇలాంటి ప్లేయర్ ఇపుడు గాయానికి గురైయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీసిన దీపక్ చాహర్ (Deepak Chahar )ఆ తర్వాత తొడకండరాలు పట్టేయడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు.

దాంతో చెన్నై టీమ్ (CSK )కలవరపెడుతోంది. దీపక్ తొడ కండరాల గాయం ఎక్కువ అయితే అతను ఐపీల్ మ్యాచ్ లకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది.అతనికి దాదాపుగా 4వారాలు రెస్ట్ ఇచ్చే ఆలోచనతో ఉన్నారు. ఇదే జరిగితే 2022 ఐపీల్(IPL 2022 ) సీజన్ లో మొదట్లో జరిగే మ్యాచ్ లకు అతను దూరం కానున్నాడు. సీజన్ ఆరంభం మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్‌కు(CSK) తీరని నష్టం జరగనుంది.మరి దీపక్ ఛాహార్ త్వరగా కొలుకుంటాడో చూడాలి