మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) నటించిన సినిమా ఆచార్య (Acharay ) షూటింగ్ పూర్తి చేసుకుని విడుదకు సిద్దమవుతోంది. ఏప్రిల్ 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఇక ఈ సినిమా తరువాత 154 వ చిత్రం బాబి డైరెక్షన్ లో వాల్తేర్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ థిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కోసం రెండు పేర్లు పరిసీలిస్తున్నట్టు తెలుస్తోంది.వాటిలో ఒకటి వాల్తేర్ వీరయ్య మరోకటి వాల్తేర్ మొనగాడు. త్వరలోనే ఒక టైటిల్ ని అనౌన్స్ చేయనుట్లు ప్రకటించారు మేకర్స్. దింతో పాటు ప్రత్యేక పాత్రలో మాస్ మహరాజ రవితేజ ,చిరంజీవికి తమ్ముడిగా నటించబోతున్నట్లు టాక్.ఇక నెగటివ్ పాత్రకు తమిళ నటుడు బాబి సింహాను మేకర్స్ ప్రకటించారు.ఇక ఈ సినిమాలో బాబి సింహా విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాని మైత్రిమూవీ మేకర్స్ బేనర్ పై తెరకెక్కుతుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Recent Comment