టాలీవుడ్ (Tollywood)సినీ రచయిత చిన్ని కృష్ణ మీద దాడి జరిగింది. తెలుగు సూపర్ హిట్స్ సినిమాలకు కథ అందించిన చిన్ని కృష్ణ ఇండస్ట్రీ కొంత మంది పెద్దల మీద ఆరోపణలు చేస్తూ వార్తలలో నిచిలిచాడు.ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న చిన్ని కృష్ణ మరో సారి హాట్ టాపిక్ గా మారాడు. ఆయన మీద కొంత మంది దాడి చేసి కొట్టడానికి వచ్చినట్టు తెలుస్తోంది.
చిన్ని కృష్ణకి (Chinni Krishna )సంబంధించి శంకర్‌పల్లి గ్రామపంచాయితీ పరిధిలో లో ఉన్న తన భూమిని కొంత మంది కబ్జా చేశారు. దాంతో హైకోర్టులో కేస్ వేసిన చిన్నికృష్ణ స్టే తెచ్చుకున్నారు.దాంతో కోపం తెచ్చుకున్న రియల్టర్లు చిన్నికృష్ణపై దాడికి ప్రయత్నించారు. బూతులు మాట్లాడుతూ కొట్టడానికి వచ్చారని చిన్నికృష్ణ తెలిపార.దీనికి సంబంధించి శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.కరోనాతో బాధపడుతున్న నాపై ఇంట్లోకి చొరబడి వచ్చి దాడి చేశారని చిన్ని కృష్ణ (Chinni krishna ) తెలిపారు.
Recent Comment