మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej) నటించిన గని(Ghani) సినిమాకు సెన్సార్ పనులు ముగిసాయి. గని సినిమాకు సెన్సార్ UA సర్టిఫికెట్ జారి చేసింది. బాలివుడ్ క్రేజి బ్యూటీ సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్ పక్కన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇక మూవీ చూసిన సెన్సార్ వాళ్ళు పాజిటివ్ టాక్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీలో వరుణ్ తేజ్(Varun tej ) నటన హైలైట్ అవుతుందని తెలిపారట.అలాగే బాక్సింగ్ నేపద్యంలో వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక వాయిదా పడుతూ వస్తున్న గని 25 వస్తుండడంతో వరుణ్ ఫాన్స్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అదే రోజు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) భీమ్లా నాయక్ (Bheemla Nayak ) సినిమా కూడ రీలిజ్ అవుతుండటంతో భాబాయ్, అబ్బాయిల మధ్య గట్టి పోటీనే ఉన్నట్టు కనిపిస్తోంది .