వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గని(Ghani). ఈ మూవీలో వరుణ్ తేజ్( Varun Tej) బాక్సర్ గా కనిపిస్తున్నాడు .ఇక ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ టీజర్స్ అలాగే పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి .గని(Ghani) మూవీ రిలీజ్ డేట్ మీద కొంచెం అనుమానాలు ఉన్నాగాని వాటిని ఈ రోజు క్లియర్ చేశారు చిత్ర యూనిట్ .గని (Ghani)చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఒక పోస్టర్ ను విడుదల చేసారు .ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ (Varun Tej ) లుక్ పవర్ ఫుల్ గా ఉంది. బాక్సాఫీస్ మీద పంచ్ విసరడానికి వరుణ్ తేజ్ (Varun Tej )రెడీ అయిపోయాడు. ఇక ఈ చిత్రానికి తమన్ (S Thaman) సంగీతాన్ని అందిస్తుండగా, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra) విలన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ సెట్టి(Sunil Shetty) వరుణ్ తేజ్(Varun Tej) కి బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో తమన్నా(Tamannaah ) కూడా ఒక స్పెషల్ ఐటం సాంగ్ చేసింది. టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న గని (Ghani) ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.