రవితేజ ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. డింపుల్ హాయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఖిలాడి మూవీ మీద కేసు పెట్టాడు బాలీవుడ్ నిర్మాత.ravi Teja Khiladi హిందీలో కూడా అదే పేరుతో రిలీజ్ అయ్యింది. దీనిపై హిందీ నిర్మాత రతన్ జైన్ తెలుగు దర్శక నిర్మతల మీద కేసు పెట్టాడు.ఖిలాడి టైటిల్ మాదని, 1992 లో అక్షయ్ కుమార్ తో ఈ టైటిల్ తో సినిమా కూడా రిలీజ్ చేశామని తెలిపారు.ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద టైటిల్ నేను రిజిస్టర్ చేశానని, కాబట్టి రవితేజ ఈ టైటిల్ తో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని తెలిపారు.హిందీలో కూడా ఖిలాడి టైటిల్ తో మూవీ రిలీజ్ అయ్యింది ,దాంతో రిలీజ్ ఆపాలని ట్రై చేసిన సమయం దాటిపోవడంతో కోర్ట్ అపలేమని చెప్పారని అందుకే ఇపుడు ఓటిటి రిలీజ్ అయిన ఆ టైటిల్ తో రాకుండా ఆపాలని కేసు పెట్టాడు. మరి ఈ విషయంపై రవితేజ దర్శకనిర్మాతలు ఎలా స్పదింస్తారో చూడాలి.