శ్యామ్ సింగరాయ్ (Shyam singh roy ) సినిమాతో హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని (Nani)ప్రస్తుతం అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాతో త్వరలోనే మళ్లి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ఈ సినిమాలో మళయాళ బ్యూటీ నజ్రియ హీరోయిన్ గా నటిస్తోంది.శ్యామ్ సింగరాయ్ చిత్రం లాగానే అంటే సుందరానికి సినిమా కూడా విజయం సాదిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.ఇక ఇది కాకుండా మరో సినిమా కూడా నాని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల నాని (Nani) పూజా కార్యక్రమాలు పూర్తిచేసాడు మీ మూవీకి దసరా అనే టైటిల్ పిక్స్ చేశారు.నాని(Nani), కీర్తీసురేష్ (Keerthy suresh)కలసి ఇంతకు ముందే నేను లోకల్ సినిమా లో నటించారు . ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు వీద్దరు మళ్ళీ మూవీ చేయడంతో దసరా(Dasara) మూవీ మీద అంచనాలు పెరిగాయి.