టీమిండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ).టీమ్ లోకి వచ్చిన కొద్ది సమయంలో ని స్టార్ ప్లేయర్ గా ,పరుగుల మెషిన్ గా పేరు తెచ్చుకున్న కోహ్లీ( Kohli ) , ధోనీ ( Dhoni ) తర్వాత టీమిండియా కెప్టెన్ గా కూడా సేవలు అందించాడు. ఇక కెరీర్ మొదట్లో ఐపీఎల్ లో తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఇటీవల మీడియాతో పంచుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్ (IPL ) సీజన్ మొదలైనప్పటి నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB )కి కోహ్లీ ఆడుతున్నాడు .2008లో జరిగిన మొదటి సీజన్లో తనకు జరిగిన అవమానం గురించి కోహ్లీ చెప్పుకొచ్చారు. 2008లో జరిగిన మొదటి సీజన్లో కేవలం 165 పరుగులు మాత్రమే చేయడంతో కోహ్లీని ఒక అనామక ప్లేయర్ గా చూశారట RCB యాజమాన్య0. దాంతో ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కోహ్లీకి ఒక డొక్కు కారుని అరేంజ్ చేశారట. మిగతా ఆటగాళ్లకు ఏసీ కార్లను, లగ్జరీ కార్లను ప్రొవైడ్ చేసిన యాజమాన్యం కోహ్లీకి(Kohli ) మాత్రం ఒక పాత డొక్కు కారుని ప్రయాణానికి అరేంజ్ చేశారట. ఆ అవమానాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను అంటూ ఇటీవల కోహ్లీ తెలియజేశాడు .కానీ ఆ తర్వాత అవన్నీ మర్చిపోయి టీం కోసం కోహ్లీ పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ కూడా చేరాడు .కానీ RCB కి టైటిల్ అందించలేదన్న బాధ ఇప్పటికీ నాకు ఉందని కోహ్లీ తెలిపాడు.