యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram ) నటించిన సెబాస్టియన్ పిసి 524(Sebastian PC524 ) మార్చి నెల 24న విడుదల చేస్తున్నారు. రేచీకటి ఉన్న హీరో కానిస్టేబుల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదరుకుంటాడు అనే కథాంశంతో ఫుల్ కామెడీగా థియేటర్స్ లో సందడి చేయనుంది.ఈ సినిమాని బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించారు. జోవిత సినిమాస్(Jovitha Movies ) పతాకంపై కోమలి ప్రసాద్, నువేక్ష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటి వరకు హీరో కిరణ్(Kiran Abbavaram ), రాజావారు రాణివారు,S.R. కల్యాణ మండపం వంటి సినిమాలలో నటించాడు.

ఇక ఈ సినిమాలో జీబ్రాన్ సంగీతంలో వచ్చిన సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్ఛింది. దీంతొ ప్రేక్షకులని బాగా నవ్వించి మంచి హిట్ సాదిస్తుందని సినిమా యూనిట్ బావిస్తున్నారు. మార్చ్ 4న విడుదల అవుతున్న(Sebastian PC 524) ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.