మహేష్ బాబు(Mahesh babu ) కూతురు సితారకి(Sithara ) ఇప్పటికే మంచి పాలోయింగ్ ఉంది. మహేష్ మూవీకి సంబంధించిన పాటలు పాడుతూ, డాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో అలరిస్తుంది. ఇపుడు తాజాగా సితార(Sithara) వేసిన డాన్స్ వైరల్ గా మారింది. మహేష్ బాబు సర్కారు వారి పాట(Sarkaaru vaari paata) సినిమాలో కళావతి సాంగ్ కి(Kalavathi song ) సితార వేసిన స్టెప్స్ అదరగొడుతున్నాయి.తండ్రి మహేష్ ని అనుకరిస్తూ సితార వేసిన డాన్స్(Sithara dance ) ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇటీవల రిలీజ్ చేసిన కళావతి సాంగ్ (Kalavathi song )రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది. ఇక ఈ సాంగ్ లో మహేష్ బాబు లుక్ ,స్టయిల్ ఫాన్స్ కి సూపర్ గా నచ్చేసాయి.అభిమానుల్లో అంచనాలు పెంచేసిన సర్కారు వారి పాట (Sarkaaru vaari paata )మే12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్(Keerthy suresh ) నటిస్తుండగా పరుశురాం డైరెక్ట్ చేస్తున్నాడు.