అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్( Sumath ) నటించిన మళ్ళీ మొదలైంది ( Malli modalaindi) సినిమా ఇటీవల ఓటిటిలో విడుదల అయ్యి మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సుమంత్, ఎన్టీఆర్( NTR) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో అటు నటనలో ఇటు డాన్స్ లో ఎన్టీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇదే విషయాన్ని హీరో సుమంత్ కూడా తెలిపారు. ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలను యాంకర్ సుమంత్ ని అడగ్గా ,వాటికి సమాధానం చెప్తూ నా దృష్టిలో ఎన్టీఆర్ ఒక ఫర్ ఫెక్ట్ యాక్టర్ అని, ది బెస్ట్ యాక్టర్ అని తెలిపారు .చిన్న వయసులోనే తన నటనతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు. నటన అనేది తన బ్లడ్ లోనే ఉంది అని ఎన్టీఆర్ గురించి చెప్పాడు. స నందమూరి తారకరామారావు గారి పోలికలు జూనియర్ ఎన్టీఆర్ అనువనువున పునికి తెచ్చుకున్నాడని యమదొంగ లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా అటువంటి డైలాగ్స్ మరి ఇతర హీరో చెప్పలేడని, ఎన్టీఆర్ లో నటనతో పాటు డాన్స్ ,అందరితో కలిసిపోయే మంచి మనస్తత్వం ఉందని తెలియజేశారు.ఎన్టీఆర్ గురించి సుమంత్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి