పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా మూవీ రాధే శ్యామ్‌. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి పండగా సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సద్దమవుతోంది. అయితే, దేశంలో కరోనా, ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో   ఈ సినిమా వాయిదా అంటూ వార్తలు వినిపించడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకవుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది రాధే శ్యామ్ చిత్రబృందం. ‘రాధే శ్యామ్‌’ రిలీజ్ డేట్ అంశంపై  వస్తున్న వార్తలు అబద్దమని తెలిసేలా కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అభిమానులకు న్యూ ఇయర్ విషెష్ చెబుతూ వదిలిన ఈ పోస్టర్‌లో జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఇక రాధే శ్యామ్‌ సినిమా వాయిదా పడటం లేదని తెలియడంతో ప్రభాస్ అభిమానులు . ఆనందపడుతున్నారు. ఇక మరోవైపు రాధేశ్యామ్‌తో పాటు సలార్‌, ఆదిపురుష్‌, స్పిరిట్‌, ప్రాజెక్ట్‌ కే సినిమాలతో ప్రభాస్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సలార్‌, ఆదిపురుష్‌ షూటింగ్‌లను పూర్తి చేసుకోగా.. ఇటీవల నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.