టాలీవుడ్ క్రేజీ హీరోస్ NTR ,రామ్ చరణ్ (Ram charan )కలయికలో రాజమౌళి (Rajamouli)450కోట్ల భారి బడ్జెట్ తో నిర్మించిన చిత్రం RRR .ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడింది. ఎట్టకేలకు RRR సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి మార్చ్ 25న విడుదల చేస్తున్నారు.ఈ సినిమా 14 బాషల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే RRR సాంగ్స్ ,ట్రైలర్ ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగించాయి. ఇక RRR సినిమా మార్చి 25న భారీగా విడుదల చేస్తున్నారు.

ఇక ప్రమోషన్ జోరు పెంచాలని చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 9న మరియు14న రెండు న్యూ అప్డేట్స్ రానున్నట్టు టాక్. ఒక సాంగ్ తో పాటు మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. రౌద్రం రణం రుధిరం (RRR)పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.ఇక పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈసినిమా ఎంత కలేక్షన్స్ కైవసం చేసుకుంటుందో చూడాలి.