న్యూ ఇయర్‌లో అందరికి బిగ్‌ షాక్‌ ఇస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ  విడుదల మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, థియేటర్‌ ఆక్యుపెన్సీలో నిబంధనలతో సినిమా వాయిదా వేసేందుకే చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది.  ఒమిక్రాన్‌ ఉధృతి వల్ల ఈ నెల 7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలను నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అయితే సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‌అన్ని భాషల్లో కూడా భారీ ఈవెంట్ లు ఇంటర్వ్యూలు చేసింది. అయితే ఊహించని వాయిదాతో ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం భారీ స్థాయిలోనే నష్టం వచ్చిందనితె లుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం “ఆర్ఆర్ఆర్”  ఈ ప్రమోషన్స్ విషయంలో 18 కోట్లు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కాగా, ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అలాగే ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు