మెగాస్టార్ చిరంజీవి అచార్య సినిమా నుంచి విడుదలైన లాహే లాహే,  నీలాంబరి పాటలు ఆకట్టుకోగా తాజాగా విడుదలైన “సానా కష్టం”  పాట అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.  ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి తన డాన్స్ తో, డాన్స్ లో కింగ్ అని మరోసారి మరోసారి నిరూపించాడు.

అయితే సంగీత పరం గా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  ఆ సంగీతం వింటూంటే పదిహేను సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన ట్యూన్ మణి శర్మ ఇప్పుడు ఇచ్చినట్లు గా ఉంది.  పాట, అందులోని పదాలు, సంగీతం ఏమాత్రం చిరంజీవి సినిమా కి తగ్గట్టుగా లేవు.

ఈ పాట అభిమానులను పూర్తిగా నిరుత్సాహపరిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.  ఆచార్య విడుదలకు ఇంకా సమయం ఉంది కావున, ఇలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

అభిమానుల అంచనాలు అందుకోలేకపోయిన ఆచార్య పాట… “సానా కష్టం”  సానా కష్టమే