దేశంలో అతి పెద్ద పార్టీలు ప్రస్తుతం bjp ,కాగ్రెస్ కూటమి. ఇప్పటి వరకు దేశాన్ని పాలించింది ఈ రెండు పార్టీలే. ఇపుడు మూడో పార్టీ వచ్చేలా తెలంగాణ( Telangana ) ముఖ్యమంత్రి కెసిఆర్(KCR ) ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దేశంలో బీజేపీ(BJP ) వ్యతిరేక పార్టీలను కలుస్తూ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు.ఈరోజు నారాయణ ఖేడ్ లో పర్యటించిన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం, ఇప్పుడు బంగారు ఇండియా తయారు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
ఇండియాని(India ) కూడా అమెరికాలా అభివృద్ధి చేయాలని చెప్పారు. శాంతి ,భద్రతలు దేశంలో బాగాలేదని, ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు చేస్తున్నానమని తెలిపారు. భారత్ దేశంలో రాజకీయం ఉండాల్సిన విధంగా లేదని ,వాటిని మార్చాలని తెలిపారు. అందుకే అటువంటి అడుగులు వేసేలా ప్రయత్నాలు చేయడానికి రెడీ అయ్యానని, యుద్ధానికి బయల్దేరానని ,మీ ఆశీస్సులు కావాలని కోరారు.
Recent Comment