మజిలీ(Majili ),లవ్ స్టోరీ (Love Story )సినిమాతో మంచి సూపర్ హిట్స్ కొట్టిన నాగచైతన్య(Naga Chaitanya) ,తండ్రి నాగార్జునతో(Nagarjuna) బంగార్రాజు (Bangarraju )తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. యువ హీరోల్లో ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ కొడుతోంది నాగ చైతన్య మాత్రమే. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన బంగార్రాజు చిత్రం కరోనా టైమ్ లో కూడా మంచి వసూళ్లు సంపాదించింది.

ఇక నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం థాంక్యూ(Thank You ).ఈ థ్యాంక్యూ సినిమాతో సమ్మర్ హాలిడేస్ లో మళ్ళీ రాబోతున్నాడు చైతు.ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.విక్రం కె కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా తరువాత చైతు ,విజయ్ కనక మేడల డైరెక్షన్ లో ఒక సినిమా చేసెందుకు సిద్దమయ్యాడు.ఇక థ్యాంక్యూ(Thank You ) సినిమా థియేటర్స్ లో ఎలాంటి హిట్ సొంతం చేసుకుటుందో చూడాలి.ఈ చిత్రంలో చైతూకి జోడిగా రాశి ఖన్నా (Rasi Khanna )నటిస్తోంది.