టీమిండియా ఆటగాళ్లలో తక్కువ కాలంలోనే స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు శ్రేయాస్ అయ్యర్ (Sreyas ayyar).ఇక ఐపీఎల్(IPL) లో కూడా భారీ స్కోర్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2022 IPL మెగా వేలంలో కలకత్తా నైట్ రైడర్స్ (KKR ) జట్టు శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayyar ) 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మార్చి నెల చివరి వారం నుండి మొదలయ్యే కొత్త ఐపీఎల్ సీజన్ లో తమ జట్టు కెప్టెన్ ఎవరో ప్రకటించారు కలకత్తా నైట్ రైడర్స్(KKR) యాజమాన్యం .ఈ సీజన్లో కలకత్తా నైట్ రైడర్స్ జట్టు కి శ్రేయాస్ అయ్యర్ ని సారథిగా నియమించారు.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2020 ipl లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని అయ్యర్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.కానీ కప్పు గెలవకపోయినా అయ్యర్ కెప్టెన్సీకి ప్రశంసలు దక్కాయి.అందుకే అయ్యర్ ని KkR తమ జట్టుకు కెప్టెన్ చేసింది. ఇక గంగూలీ, గంభీర్,మెక్ కలమ్,దినేష్ కార్తీక్ ,ఇయాన్ మోర్గాన్ తరువాత KkR టీమ్ కి కెప్టెన్ అయ్యాడు అయ్యర్. మరి తాన్ కెప్టెన్సీ లో అయ్యర్ KkR ని ipl టైటిల్ విజేతగా నిలుపుతాడేమో చూడాలి.