పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.  త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలై ఫస్ట్‌లుక్, టీజర్‌, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్రబృందం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’ పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చాయి.  ఈ క్రమంలోనే పవర్ స్టార్  ఫ్యాన్స్ ఎగిరిగంతేసే కొత్త అప్‌డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో లాలా..భీమ్లా డీజే వర్షన్ సన్గ్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు నూతన సంవత్సర కానుకగా..  డిసెంబర్ 31 రాత్రి 7 గంటల 2 నిమిషాలకు లాలా..భీమ్లా డీజే వర్షన్ విడుదలకు కానుందని, కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ‘భీమ్లా నాయక్’ను ముందుగా సంక్రాంతి కానుకగా  జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత‌లు భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు పెద్ద  ఎత్తున విడుద‌ల‌వుతుండ‌టంతో ‘భీమ్లా నాయక్’ వాయిదా పడింది. ప్ర‌స్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమాను మహా శివ రాత్రి కానుకగా  ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు.